నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి పనుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా, జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు. పాత కేసుల ద్వారా తాను భయపడనని అన్నారు. ఇరిగేషన్లో అవినీతి ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వాన్నంగా ఉందని విమర్శించారు.