మానవతా విలువలున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొనియాడారు. నెల్లూరు మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో శనివారం సాయంత్రం అనారోగ్య బాధితులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణి చేశారు. కోవూరుకు చెందిన నిక్కుదల నాగేశ్వరరావుకు 8 లక్షలు ఇందుకూరుపేట వాసి పనబాక శ్రీరామ్ కు 4, 00, 689 తో పాటు పలువురికి చెక్కులు అందజేశారు.