నెల్లూరు నగరపాలక సంస్థలో పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ విభాగంలోని రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను, బదిలీ చేస్తూ ఉత్తర్వులను కమిషనర్ సూర్యతేజ శనివారం జారీ చేశారు. ఆర్. ఓ లుగా ఉన్న ఎస్. ఏ. సమద్, వి. రాజేశ్వరిలను హెల్త్ సెక్షన్ శానిటరీ సూపర్వైజర్ లుగా బదిలీ చేశారు. మరో ఆర్. ఓ. పి. శ్రీనివాసులును రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ గా బదిలీ చేశారు.