సంగం: ఆర్టీసీ బస్సులో పోలీసుల తనిఖీలు
సంగంలోని ఆర్టీసీ బస్టాండ్ లో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేశారు. సీఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్సులోని అనుమానితులను గుర్తించి వారి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇటీవల కాలంలో అక్రమంగా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా ఎక్కువైన నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను గుర్తించి పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.