సాధారణ ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ అతి ఘోరంగా పరాజయం పాలయ్యింది. గత ఎన్నికల్లో జిల్లా లోని అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న వైసిపి ఇంతటి ఘోర పరాజయం చవి చూడడం పట్ల వైసిపి శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని పెంచడానికి నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో గురువారం పర్యటించారు. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.