మాంబట్టు 33కేవీ సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం

6911చూసినవారు
మాంబట్టు 33కేవీ సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం
తడ మండలం పరిధిలోని మాంబట్టు 33కేవీ సబ్ స్టేషన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అపాచీ పరిశ్రమ జనరల్ మేనేజర్ గోవిందస్వామి పరిశ్రమ ఫైర్ సేఫ్టీ సిబ్బందిని అప్రమత్తం చేసి, అపాచీ అగ్నిమాపక కేంద్రానికి ఘటనాస్థలికి పంపారు. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా మంటలను అదుపు చేశారు. వేగంగా స్పందించి పెనుప్రమాదాన్ని నివారించిన ఫైర్ సేఫ్టీ సిబ్బందిని అపాచీ జనరల్ మేనేజర్ అభినందించారు. సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసిన అపాచీ ఫైర్ సిబ్బందికి తడ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ హరికృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్