జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తడ తహసిల్దార్ కార్యాలయంలో తడ తాసిల్దార్ శాంతకుమారి బూత్ లెవెల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలియజేశారు. గ్రామ సచివాలయలతోపాటు, రెవెన్యూ కార్యాలయం వద్ద అధికారులు అందుబాటులో ఉన్నారని తెలిపారు.
ఆధార్ తో పాటు పదవ తరగతి మార్కులు లిస్టు పత్రాలను అధికారులు అందజేసి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. బూత్‌లెవల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి మార్పులు మరియు చేర్పులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారులు, మండల బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.