అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఐసీడీఎస్ సూపర్ వైజర్లు జ్యోతి కిరణ్ మరియు అంకమ్మ తెలిపారు. నాయుడుపేట సత్తార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు పూర్వ ప్రాథమిక విద్య నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ముగిసింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో మూడు ఏళ్ల నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆట పాటలతో ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియం బోధించేందుకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుందని తెలిపారు. అనంతరం అంగన్వాడి కార్యకర్తలు రూపొందించిన నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు పాల్గొన్నారు.