ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు

1403చూసినవారు
ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు
నాయుడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరు సమీపంలో స్వర్ణముఖి బ్రిడ్జి వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలలోని ఆక్రమణలను నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ సిబ్బందితో కలిసి తొలగించారు. ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలను జెసిబి సహాయంతో తొలగించారు. ఎం.పీ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రభుత్వ లేఅవుట్ ఏర్పాటు చేసి పేదలకు నివేశన స్థలాలు కేటాయించారు.

నివేశన స్థలాలు లబ్ధిదారులకు కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ లేఅవుట్ సమీపంలో రహదారి పక్కన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణ తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్