నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం భీములవారిపాళెం రైల్వే గేట్ వద్ద ఓ వ్యక్తి స్కూటర్‌పై 72 తమిళనాడు మద్యం క్వార్టర్ బాటిళ్లను ఆంధ్రకు తరలిస్తుండగా ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట ఎస్ఈబీ సీఐ ప్రసాద్ మాట్లాడుతూ :- తమిళనాడు రాష్ట్రం గుమ్మడిపూండికి చెందిన వంగలపూడి నానాజీ అనే వ్యక్తి ఏపీ 26 సీడీ 5799 నంబరు హోండా యాక్టివాపై ఆరంబాకంలో కొనుగోలు చేసిన మద్యాన్ని సూళ్లూరుపేట వైపు తీసుకు వస్తున్నారు.
తడ మండలం పరిధిలోని భీములవారిపాళెం రైల్వే గేట్ సమీపంలో తమ సిబ్బంది కాపు కాచి పెట్టుకున్నారని ఆయన తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడు ఉపయోగించిన హోండా యాక్టివా స్కూటీని సీజ్ చేసి.. కేసు నమోదు చేశామని అన్నారు. ఈ దాడిలో ట్రైన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య, వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నట్టు వెల్లడించారు.