నాయుడుపేట పట్టణంలోని మున్సిపల్ కూరగాయల మార్కెట్ లో వ్యాపారులు కూరగాయల విక్రయాలను మొదలుపెట్టారు. మార్చిలో కరుణ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాయుడుపేట మున్సిపల్ కూరగాయల మార్కెట్ ను మూసివేసిన విషయం విధితమే. మార్కెట్ శిథిలావస్థకు చేరి ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే సంజీవయ్య ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ లీజు దారులకు ఇబ్బందులు లేకుండా సుమారు పది లక్షల రూపాయల నిధులు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించారు.
రెండు రోజుల కిందట ఎమ్మెల్యే చేతులమీదుగా మార్కెట్ ను ప్రారంభించారు. మార్కెట్లోని దుకాణదారులు నాయుడుపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారులు తిరిగి మార్కెట్ లో దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.