కరోనా వ్యాక్సింగ్ చేయించుకున్న వారు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని నాయుడుపేట ఐ.సీ.డీ.ఎస్ సీడీపీఓ హేనా సూజన్ తెలియజేశారు. నాయుడుపేట పట్టణంలోని సామాజిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఐ.సీ.డీ.ఎస్ సీడీపీఓ హేనా సూజన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సింగ్ చేయించుకున్న వారికి అరగంటలోపు పరిశీలనలో ఉంచి వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకపోవడంతో వారిని ఇంటికి పంపేశారు.
ఈ సందర్భంగా ఐ.సీ.డీ.ఎస్ సీడీపీఓ హేనా సూజన్ మాట్లాడుతూ :- నాయుడుపేట ఐ.సీ.డీ.ఎస్ ప్రాజెక్టు పరిధిలో 213 మంది అంగన్వాడీ టీచర్లు, 183 మంది ఆశ వర్కర్లు ఉన్నారని అన్నారు. కరుణ వైరస్ మహమ్మారి అంతం చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని ఆమె అన్నారు. వివిధ దేశాల్లో కరోనా రెండో దశ ప్రారంభమైందని అన్నారు. మన దేశంలో కోవిడ్ రెండో దశను అడ్డుకునేందుకు ప్రభుత్వం కోవి ఫీల్డ్ వ్యాక్సిన్ను వేస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో కూడా మన టెక్నాలజీతో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడం మంచి పరిణామమని అన్నారు.