వరికుంటపాడులో ఆశాడే కార్యక్రమం

58చూసినవారు
వరికుంటపాడులో ఆశాడే కార్యక్రమం
నెల్లూరు జిల్లా వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యాధికారిని కరిష్మా ఆధ్వర్యంలో ఆశాడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ, ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ రాజశేఖర్ రాజు, పిహెచ్ఎన్ సుశీలమ్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్