జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కరోనా వల్ల సమయానికి ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జనసేన కార్యకర్తలు ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఐదు ఆక్సిజన్ సిలెండర్స్ ,ఆక్సిమీటర్స్, ఆక్సిజన్ మాస్క్ లు సోమవారం నాడు అందిస్తున్నట్టు జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ నాయకులు ఆల్లూరి రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.