దుత్తలూరు మండలం భైరవరం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి దుత్తలూరు తహశీల్దార్ నాగరాజుకు సోమవారం ఫిర్యాదు చేశారు. తమకు ఇచ్చిన సిజిఎఫ్ఎస్ భూమిని గ్రామానికి చెందిన కొంతమంది ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. తమ యొక్క సర్వేనెంబర్ 69-2 లో 5.3 ఎకరాల భూమి ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఆక్రమదారుల నుంచి తమ భూమి తమకు ఇప్పించాలని వారు తహశీల్దార్ కు విజ్ఞప్తి చేశారు.