ఉదయగిరిలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయండి

971చూసినవారు
ఉదయగిరిలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు  చేయండి
మెట్ట ప్రాంతమైన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో మెట్టప్రాంత ప్రజలకు అందుబాటులో ఉదయగిరి పట్టణంలో కరోనా ఆసుపత్రి ఏర్పాటు కొరకు ఎంపిడిఓ వీరాస్వామికి జనసేన నాయకులు ఆల్లూరి రవీంద్ర, సురేంద్ర రెడ్డి, కిరణ్ కుమార్ తదితరులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు ఆల్లూరి రవీంద్ర మాట్లాడుతూ.. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నయని నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో నెలకొన్న పడకల కొరత కారణంగా ఇక్కడ కరోనా బాధితులను పట్టించుకోవడం లేదని, వారికి సరైన వైద్యం అందడం లేదని, అందువలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నరని వారు తెలిపారు.

సీతారామపురం మండలం మండలానికి చెందిన వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో కోవిడ్ ఆసుపత్రి లేక నెల్లూరు వెళ్లే మార్గంలోనే చనిపోయారని అందుబాటులో కోవిడ్ ఆసుపత్రి ఉంటే వారు చనిపోయే పరిస్థితి ఉండేది కాదని అందుచేత అధికారులు స్పందించి మెట్టప్రాంత ప్రజలకు అందుబాటులో ఉదయగిరిలో ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కరోనా ఆసుపత్రిగా మార్చి పడకల సామర్ధ్యం పెంచి మెట్ట ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించవల్సినదిగా కోరడం జరిగింది. అదేవిధంగా కాంట్మెంట్ జోన్ లలో అధికారులు బ్లీచింగ్ చల్లకుండా కేవలం సున్నం చల్లుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్