జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమంలో భాగంగా టీమ్ పిడికిలి వారు రూపొందించిన వాల్ పోస్టర్లు, ఆటో స్టిక్కర్లను ఉదయగిరి నియోజకవర్గ జనసైనికుల ఆధ్వర్యంలో ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎంతో మంది కౌలు రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని వారికి భరోసా కల్పించి వారికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రారంభించారని వారు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారికి ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని, వారికి జనసేన పార్టీ తరుపున భరోసా కల్పించడం కోసం చనిపోయిన ప్రతి రైతుకు లక్ష రూపాయలు చొప్పున జనసేన పార్టీ తరఫున వారి సొంత నిధులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఇప్పటి వరకు 200 మంది కౌలు రైతులకు లక్ష రూపాయలు చొప్పున రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటన చేసి ఎవరైతే చనిపోయిన మూడు వేల మంది కౌలు రైతులకు ప్రతి రైతుకు లక్ష చొప్పున సుమారు 30 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు.
మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో కూడా సాగునీరు లేక, సరైన గిట్టుబాటు ధర లేక , పండిన పంట చేతికి అందక, చేసిన అప్పులు తీర్చలేక ఎంతోమంది కౌలు రైతులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉందని ప్రభుత్వం పట్టించుకోని కౌలు రైతులకు అండగా నిలబడాలని చనిపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం బీమా ద్వారా 7 లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవాలని వారు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర , నియోజకవర్గ నాయకులు , నిమ్మలపల్లి రామ చైతన్య, మండల ఇంచార్జ్ కల్లూరి సురేంద్ర రెడ్డి, జనసేన నాయకులు, గాదె నరేంద్ర, ఆకుల వెంకట్, దిలీప్ కుమార్, వాహిద్, హరికృష్ణ, శుభాని, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.