ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలంటూ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర వైకాపా ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ. కష్టకాలంలో ప్రజలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, కరోణా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలకు ఉగాది కానుకగా 1400 కోట్ల విద్యుత్ భారం ట్రూ అప్ కింద 3 వేల కోట్ల రూపాయల భారం వేయటం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. దానికి తోడుగా రోజులో 3 నుండి 6 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారని వేసవి తాపాని తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించి, కరెంటు కోతలు లేకుండా చూడాలని వారు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.