విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఉదయగిరి నియోజకవర్గం లోని దాతలు, టిడిపి, జనసేన, బిజెపి, నాయకులు అందజేసిన 20 లక్షల మూడు వేల 655 రూపాయలను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి గురువారం చెక్కుల రూపాన అందజేశారు. వరద బాధితుల కష్టాలను తెలుసుకున్న సేవా భావం కలిగిన వివిధ ప్రాంతాల వారు స్వచ్ఛందంగా చెక్కుల రూపాన విరాళాలు అందజేశారు.