ఉదయగిరి మెట్ట ప్రాంత వాసులు సరైన నీటి సదుపాయం లేక కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారని బిజెపి జిల్లా నాయకులు మిడతల రమేష్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ అడుగంటిన భూగర్భ జలాలతో సేద్యం చేస్తున్నందున ఆ నీటిలోని బారలోహాల కారణంగా ప్రజలు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు, వెలుగొండ ప్రాజెక్ట్ నీటిని పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కు తరలించాలని కోరారు.