నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బిజ్జంపల్లి లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు గణిత దీప్తి అనే గణిత మెటీరియల్ (ఉపాధ్యాయులచే తయారు చేయబడిన) ను గణిత ఉపాధ్యాయులు జె. కృష్ణయ్య తమ స్వంత నిధులతో అందజేయడం జరిగింది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ మెటీరియల్ రూపొందించడం జరిగింది. అలాగే ఉత్తమ ఫలితాలను సాధించడానికి ఉపయోగపడుతుంది.