శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతంగా ఉదయగిరి ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఆర్కియాలజీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఉదయగిరిలోని ప్రాచీనాలయాలు, కోటలను పరిశీలించిన విషయం విధితమే. మరోసారి ఎమ్మెల్యే ఆదేశాలతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, ఉదయగిరి కన్వీనర్ బయన్న సోమవారం అక్కడ పర్యటించారు.