వింజమూరు: స్పష్టంగా కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం

53చూసినవారు
వింజమూరు పట్టణంలోని పంచాయతీ ఆఫీసు పక్కన డ్రైనేజ్ అద్వానంగా ఉంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు డ్రైనేజీలో ఉన్న మరుగునీరు ఎక్కడ నీరు అక్కడే స్తంభించిపోయింది. వ్యర్థాలతో డ్రైనేజీ నిండిపోవడంతో నీరు ముందుకు పోవడం లేదు. డ్రైనేజీ కాలువపై పైకప్పు లేకపోవడంతో పొరపాటున ఎవరైనా కాలుజారి పడితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ మొత్తంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్