ఏపీలో నూతన పాలసీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం కేబినెట్ ముందుకు 5,6 నూతన పాలసీలు వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించేలా కొత్త విధానాలు తీసుకురానుంది. పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ శాఖల్లో కొత్త పాలసీలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.