దమ్కీలకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా.. ఆయన మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహరాజ్ నడిచిన నేలపై తాము ఎవరికీ భయపడేది లేదన్నారు. సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యమని అన్నారు.