ఆరు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ నైజీరియాకు బయలుదేరారు. ఈనెల 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయానాల్లో మోదీ పర్యటించనున్నారు. బ్రెజిల్లో జరగనున్న G-20 సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. 17 ఏళ్లలో నైజీరియాలో, 1968 తర్వాత గయానాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలువనున్నారు.