గన్నవరం: ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన గన్నవరం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఆదివారం బాపులపాడు మండలంలోని ఏ. సీతారాంపురం గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఈతకు వెళ్లి కాలువలో ఈత కొడుతుండగా లోతు ఎక్కువ ఉండడంతో మునిగిరెడ్డి అజయ్, కోలా యశ్వంత్ కృష్ణ అనే ఇద్దరు బాలురు మృతి చెందారు. కుటుంబ సభ్యులు బాలురుని చూసి శోకసముద్రంలో మునిగిపోయారు.