గన్నవరం విమానాశ్రయంలో ఆటో డ్రైవర్లు కొట్లాట
గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఆటో డ్రైవర్లు కొట్లాటకు దిగారు. ప్రయాణీకులను ఎక్కుంచుకునే క్రమంలో ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. వివాదం ముదరడంతో ఇరువురు ముష్టి యుద్దానికి దిగటంతో తోటి డ్రైవర్లు ఇద్దరిని ఆపడంతో గొడవ సద్దుమణిగింది. ఎయిర్ పోర్టులో ఆటో, క్యాబ్ లకు బుకింగ్ లేకపోవడంతో పోటా పోటీలతో డ్రైవర్లు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.