కేసరపల్లి పంచాయతీలో గ్రామసభ
గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామసభను నిర్వహించారు. తొలిత జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా, గాంధీజీ చిత్రపటానికి సర్పంచ్ చేబ్రోలు లక్ష్మి మౌనిక పూలమాలలు వేసే నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎం మౌనిక సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.