మైలవరంలోని అయ్యప్ప నగర్ లో నివాసం ఉంటున్న జనసేన కార్యకర్త గోపి అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు.తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్ గోపి కుటుంబాన్ని పరామర్శించారు. తన సొంత నిధుల నుండి 5 వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి, కూటమి ప్రభుత్వం మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.