మత్తుపదార్థాలతో భవిష్యత్తు అంధకారం

53చూసినవారు
మత్తుపదార్థాలతో భవిష్యత్తు అంధకారం
రెడ్డిగూడెం: మత్తు పదార్థాలు సేవించించడం వలన భవిష్యత్తు అంధకారం అవుతుందని రెడ్డిగూడెం ఎస్సై గోవింద్ అన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రెడ్డిగూడెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. నవజీవన్ బాలభవన్ - ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్య ద్వారా ఉన్నత స్థాయిలోనికి వెళ్లిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు.
Job Suitcase

Jobs near you