నందిగామలో ఆర్డీఓ అకస్మికంగా తనిఖీలు
నందిగామ పట్టణం పరిధిలోని రెండో వార్డు సచివాలయం, అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయంలో వివిధ రికార్డులను పరిశీలించారు. విధులలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అనంతరం ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.