మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్" ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం ఆదివారం ఆనందం వ్యక్తం చేసింది.