ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని KL విశ్వవిద్యాలయం ఐదేళ్లపాటు న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేకుండా జాతీయ మదింపు, గుర్తింపు మండలి (న్యాక్) నిషేధం విధించింది. ఈ విశ్వవిద్యాలయం A++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చిందనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో న్యాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 10 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది.