ఏపీలో వంద ఎకరాల చొప్పున 100 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక పార్కులపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 'ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా రంగాల ఆధారిత పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలి. విజయవాడ మల్లవల్లి పార్కులో పూర్తి కార్యకలాపాలు జరగాలి. ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణం ఉండాలి' అని సీఎం సూచించారు.