ఏపీ స్పీకర్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేకత

82చూసినవారు
ఏపీ స్పీకర్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేకత
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారంకు సొంత పార్టీలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆమదాలవలసలో వైసీపీ కీలక నేత సువ్వారి గాంధీకి, తమ్మినేనికి మధ్య గత కొంత కాలంగా విభేదాలున్నాయి. తమ్మినేనికి టికెట్ ఇవ్వడాన్ని గాంధీ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులకు గాంధీ దంపతులు రాజీనామా చేశారు. స్వతంత్రంగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. దాదాపు 20 వేలకు పైగా ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్