వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మహిళలపైనే 2,04,414 నేరాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. సుమారు 4,034 అత్యాచారాలు జరిగాయని, 22,278 మంది మహిళలు అదృశ్యమయ్యారని శుక్రవారం గణాంకాలు వెల్లడించింది. సైబర్ నేరాలు- 5,660, గృహ హింస కేసులు- 15,065, సామూహిక అత్యాచారాలు- 60, చిన్నారులపై నేరాలు- 7,841, మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన ఘటనలు- 6,604, హత్యలు- 991 జరిగాయని తెలిపింది.