తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిదంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. పలువురు మహిళలు తిరుమలలోని పాపవినాశనం వద్ద తమ దైవానికి సంబంధించిన పాటలకు సదరు మహిళలు రీల్స్ చేసినట్లు తెలుస్తోంది. పాప వినాశనం వద్ద 20 మంది వరకు అన్యమతస్తులు నిరంతరం ఉంటున్నట్లు సమాచారం. అయితే వీరికి స్థానిక ఫారెస్ట్ అధికారుల సహకారం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.