నిర్ధేశించిన పరిధిని దాటి రోడ్లను అక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే సహించేది లేదని అర్బన్ సీఐ పి సురేష్ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని ఎన్ఆర్‌టీ సెంటర్ నుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తూ. ట్రాఫిక్‌కు తీవ్ర విఘాతంగా మారిన వారికి అవగాహన కల్పించారు. కాలినడకన తిరుగుతూ ప్రతి ఒక్క వ్యాపారస్తుడితో మాట్లాడి అక్రమణలు తొలగించాలని సూచించారు.