తాడేపల్లి: మాజీ మంత్రి మేరుగుపై అత్యాచారం కేసు నమోదు
మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం అత్యాచారం కేసు నమోదైంది. విజయవాడకు చెందిన ఓ మహిళకు కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడంతో పాటు శారీరకంగా వాడుకున్నారని ఆరోపిస్తూ మంత్రి పై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనకు సహకరించి బాధితురాలను బెదిరించిన పిఏ పై కూడా బెదిరింపుల కేసు నమోదైంది.