ప్రఖ్యాత విలువిద్య క్రీడాకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖ శుక్రవారం మంగళగిరి మండలంలోని శ్రీపానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతి సురేఖ స్వగ్రామం చెరుకుపల్లి మండలం నడింపల్లి, తల్లిదండ్రులు శ్రీదుర్గ, సురేంద్ర కుమార్ లు జ్యోతి సురేఖ భవిష్యత్తు కోసం విజయవాడలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.