రెండు రోజులుగా పల్నాడు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు దృష్ట్యా అమరావతి మండలంలో కలెక్టర్ అరుణ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా అమరావతి మండలంలోని ధరణికోట గ్రామాన్ని ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. మూడు లంక గ్రామాలలో చిక్కుకున్న 36 మందిని, 1150 జీవాలను కలెక్టర్ చొరవతో ధరణి కోట గ్రామంలోని సురక్షిత ( బోర్డు సెంటర్) ప్రాంతానికి సంబంధిత రెవెన్యూ సిబ్బంది తక్షణమే తరలించారు.