శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు

64చూసినవారు
నకరికల్లు మండలం నరసింగపాడులో కొలువైన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అష్ఠత్తర పూజ శతనామావళి పూజ, కుంకంపూజలు చేశారు. అనంతరం అన్నపూర్ణాదేవి అమ్మవారిని వరమహాలక్ష్మిగా అలంకరించారు. మహిళలు పొంగళ్లు పొంగించి, నైవేద్యాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్