విద్యార్థులందరికి విద్యా కానుక కిట్లు: ఎంఈఓ

65చూసినవారు
విద్యార్థులందరికి విద్యా కానుక కిట్లు: ఎంఈఓ
శావల్యాపురం మండలంలోని 15 గ్రామపంచాయతీలలో 39 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, విద్యార్థులందరికి విద్యా కానుక కిట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంగళవారం మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు 24వేల 218 మందికి పాఠ్య పుస్తకాలు ఇవ్వవలసి ఉండగా. ఇప్పటివరకు 12వేల 957 మందికి పాఠ్య పుస్తకాలను అందజేశామన్నారు. విద్యార్థులకు నూరు శాతం విద్యా కానుక కిట్లు అందజేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్