బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (బుడా) చైర్మన్ తెంటు లక్షుంనాయుడుని ఆదివారం వారి క్యాంప్ ఆఫీసుకి బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన వెళ్లి కలిశారు. ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపి అయనకు ఎమ్మెల్యే బేబీనాయన సన్మానించారు. బుడా చైర్మన్ భాద్యతలు చేపట్టిన సందర్బంగా ఈ నెల 27వ తేదీన ప్రమాణ స్వీకారం నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు బొబ్బిలి కోటాలోకి చేరుకోవాలని ఎమ్మెల్యే కోరారు.