బొబ్బిలి: రేపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

59చూసినవారు
బొబ్బిలి: రేపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం
బొబ్బిలి పట్టణం సబ్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు గురువారం ఈఈ ఏ. అనంతరావు తెలిపారు. కోటి చెరువు సబ్ స్టేషన్ నుంచి మహారాణిపేట ఫీడర్కు విద్యుత్ సరఫరా అయ్యే లైన్లు కింద చెట్టు కొమ్మలు తొలగించే పనులు చేపట్టిన నేపథ్యంలో అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. పూల్ బాగ్, గొల్లవీధి, సింగారపువీధి ప్రాంతాలలో విద్యుత్ ఉండదని ప్రజలు సహకరించాలని కోరారు.