చీపురుపల్లి పంచాయతీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ వసతి గృహంలో ఓ విద్యార్థి పాము కాటుకి గురైయ్యాడు. వెంపడాపు పురుషోత్తం అనే విద్యార్ధి వసతి గృహంలో ఉంటూ సమీపంలోని రామాంజనేయకాలనీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం నిద్రపోతున్న సమయంలో అతడు పాముకాటుకి గురయ్యాడు. వసతి గృహ సిబ్బంది వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.