చీపురుపల్లి మండలం రామలింగాపురంలో గల శ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మవారికి మంగళవారం ఆలయ అర్చకులు నాగపంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం అష్టోత్తర నామాలతో క్షీరాభిషేకం నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.