దత్తిరాజేరు మండలం గొబ్యాంలో సోమవారం ఉదయం ఎంపీటీసీ వంగపండు కృష్ణమూర్తి, రెడ్డి దేవుడు చేతుల మీదుగా పింఛన్ లబ్ధిదారులకు స్థానిక సచివాలయ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం పెన్షన్లు పంపిణీ చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ల ను ఒకటో తేదీ తెల్లవారుజామునే అందజేయడం హర్షణీయమన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. ఈ మేరకు పింఛన్ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.