గజపతినగరం మండలం వ్యాప్తంగా చిరుజల్లుల కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారడంతో చల్లటి గాలులతో కూడిన చిరుజల్లులు కురిసాయి. ఖరీఫ్ మొదలవడంతో రైతులు విత్తనాలు వేసి, పది రోజులు గడుస్తున్న వర్షాలు పడకపోవడంతో కొంతమేర ఆందోళన చెందినప్పటికీ, అకస్మాత్తుగా వర్షం పడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.